చిలకలూరిపేట

Single Source of Truth

Chilakaluripet | Single Source of Truth

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

మాజీ సైనికోద్యోగి నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఏనుగువలస గ్రామానికి చెందిన వర్మ అనే మాజీ సైనికోద్యోగి తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయటానికి వీఆర్వో వెంకటస్వామి చుట్టూ గత కొద్దిరోజులుగా తిరుగుతున్నారు.

వీఆర్వో మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని పూర్తి చేస్తానని పట్టుబట్టాడు. దీంతో వర్మ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. వారి సూచనల మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకు లంచం డబ్బు అందజేస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సేవా కార్యక్రమాలను విస్తృతపర్చాలి

సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని కమ్మజన సేవా సమితి సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని మంత్రి పుల్లారావు ప్రకటించారు. సమితి అధ్యక్షుడిగా వంకాయలపాటి బలరామకృష్ణయ్య, కార్యదర్శిగా సామినేని కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా గోరంట్ల పున్నయ్య చౌదరి, పావులూరి కృష్ణకుమార్‌, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, సంయుక్త కార్యదర్శులుగా కావూరి రవించంద్ర, రాయని రమణ, కోశాధికారిగా వడ్లమూడి నాగేంద్రం, కో ఆష్షన్‌ సభ్యులుగా వడ్లమూడి శివరామకృష్ణయ్య, మర్రిపూడి సీతారామయ్య, మల్లెల హరీంద్రనాథ్‌ చౌదరి, గుంటుపల్లి కోటేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ కమ్మజన సేవా సమితి పేరు, ప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపజేయాలన్నారు. ఆర్థిక స్థోమత కారణంగా పేద విద్యార్థినుల చదువులు మధ్యలో నిలిచిపోరాదనే ఉద్దేశంతో వసతి గృహాన్ని నడుపుతున్న సభ్యులను అభినందించారు. రాష్ట్ర తెదేపా కార్యదర్శి మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎ��్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, మాజీ ఎంపీ వై.వి.రావు, పారిశ్రామికవేత్త చేబ్రోలు నరేంద్రనాథ్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచలి శివాజీ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, నాయకులు ఎన్‌.వి.వి.ఎ.వరప్రసాద్‌, వాసిరెడ్డి జయరామయ్య, చేబ్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ అదనపు ఎస్పీగా శోభామంజరి

గుంటూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అదనపు ఎస్పీగా శోభామంజరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్పీ కేవీ మోహన్‌రావు సీఐడీకి బదిలీ అయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన శోభామంజరి విజయవాడ, ఏలూరు, పశ్చిమగోదావరిలో పనిచేశారు. 2006లో సీఐగా, 2014లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. 2015లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించి గ్రామీణ నేర విభాగ ఏఎస్పీగా నియమించారు. ఇటీవల ఆమెను గుంటూరు విజిలెన్స్‌ అదనపు ఎస్పీగా నియమించారు. శనివారం గుంటూరులోని విజిలెన్స్‌ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు విజిలెన్స్‌ డీఎస్సీ రమణకుమార్‌, డీఈ కళ్యాణచక్రవర్తి, సూపరింటెండెంట్‌ గోపాల్‌, సీఐలు వంశీధర్‌, కిషోర్‌కుమార్‌, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విజిలెన్స్‌ ఏఎస్పీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శోభామంజరి మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలైనా దృష్టికి వస్తే నిర్భయంగా తమ సెల్‌ నెంబర్‌ 80082 03288 కు ఫోన్‌ చేసి సమాచారం అందివ్వవచ్చన్నారు.

అవినీతి రొచ్చులో మరో సీఐ

రూ.20 కోట్లకు పైగా ఆస్తులు 
జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం? 
ఇంటి ముందూ పోలీసుమార్కు ఆక్రమణలు

రియల్ ఎస్టేట్.. లిక్కర్ లాబీలతో నగర పోలీసుల అనుబంధం, భాగస్వామ్యం తాజా ఏసీబీ దాడులతో బట్టబయలైంది. రౌడీషీటర్ల పీచమణచాల్సిన పోలీసు అధికారులు.. ఏకంగా వారినే తమ బినామీలుగా పెట్టుకొని అడ్డగోలు వ్యాపారాలు.. దందాలతో కోట్లకు పడగలెత్తుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు.. వారి ఆస్తులకు పొంతనే లేకపోయినా పోలీస్ బాస్‌లు చూసీచూడనట్లు పోతుండటంతో అక్రమ దందాలు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి.  తాజాగా నాలుగోపట్టణ సీఐ బాలకృష్ణపై ఏసీబీ జరిపిన దాడులు ఆయనకు రౌడీషీటర్లతో ఉన్న ‘రియల్’ బంధాన్ని వెలుగులోకి తెచ్చాయి.

నగర కమిషనరేట్‌ పరిధిలోని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సి.ఐ. కె.వి.బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. మూడో పట్టణ క్రైం సీఐ కె.ఎస్‌.ఎన్‌.కొండ పట్టుబడిన ఉదంతాన్ని నగరవాసులు ఇంకా మరువక ముందే మరో సి.ఐ. పట్టుబడడంతో నగర పోలీసుల అవినీతి గుట్టురట్టవుతోంది. హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడిగా పోలీసు శాఖలో ప్రవేశించిన సీఐ బాలకృష్ణ చివరకు అవినీతి ఆరోపణలతో జైలు పాలవ్వాల్సిన దుస్థితి తలెత్తింది. ఆయన వ్యవహారశైలిని చూసిన అనిశా అధికారులు నివ్వెరపోతున్నారు.

నగర కమిషనరేట్‌లోని నాలుగో పట్టణ సి.ఐ. బాలకృష్ణ అనిశా దాడుల్లో భారీఎత్తున అక్రమ ఆదాయంతో దొరికిపోవడం నివ్వెరపరుస్తోంది. ఒకింత సౌమ్యుడిగా పేరున్న ఆయన ఇంత సంపాదించారా? అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలి తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. పి.ఎం.పాలెం ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ వెనక సందులో మూడంతస్తుల భవనం, దానికి అత్యంత సమీపంలోనే మరో మూడంతస్తుల వాణిజ్య సముదాయం ఉండడం గమనార్హం. ఆయన అత్త పేరు మీద కూడా రూ.40లక్షల విలువైన ఆస్తులుండడం విశేషం. ఆమె గృహిణి కావడంతో ఆ ఇంటిని బాలకృష్ణే కొనుగోలు చేసి ఆమె పేరుపై పెట్టినట్లు భావిస్తున్నారు. నరవలో మూడు స్థలాలు, తాళ్లవలసలో స్థలం, విజయనగరంలో ఇల్లు, దుగ్గివలసలో తొమ్మిది ఎకరాల భూమి, 25 తులాల బంగారం, మూడు కేజీల వెండి తదితరాలన్నింటి పుస్తక విలువ రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే వాటి మార్కెట్‌ విలువ మాత్రం సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆయన మామ రమణ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. 

తండ్రి అప్పలరాము పోలీసు శాఖలోనే హెడ్‌కానిస్టేబుల్‌గా చిరుద్యోగాలు చేసిన నేపథ్యంలో అధికారికంగా ఆ స్థాయిలో ఆస్తులు సమకూర్చుకోవడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. విజయనగరంలో బాలకృష్ణ తండ్రి ఇంటిని ఇటీవలి సంవత్సరాల్లోనే కూల్చివేసి దానిస్థానంలో వాణిజ్య సముదాయం కట్టినట్లు కూడా అనిశా అధికారుల పరిశీలనలో తేలింది. పి.ఎం.పాలెంలోని ఇంటి ముందు ప్రభుత్వ స్థలంలో బాలకృష్ణ రెండు రేకుల షెడ్లు నిర్మించారు. ఒక షెడ్డులో భారీగా కలప, దుంగలు దొరకడం గమనార్హం.

యోగ విజ్ఞానానికి విశ్వవ్యాప్త గుర్తింపు

భారతీయ యోగ విజ్ఞానానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన యోగా వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం చంద్రఆబు కూడా రాష్ట్రంలో యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు గ్రామ గ్రామాన యోగా దినోత్సవం నిర్వహించాలని సూచనలిచ్చారని తెలిపారు.

పనితీరు భేష్‌ - రేటింగ్‌లో చిలకలూరిపేటకు ప్రథమస్థానం

చిలకలూరిపేట పురపాలక సంఘం. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు సాంకేతికను అందిపుచ్చుకుంటూ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ పనితీరు ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్‌లో ప్రథమస్థానంలో నిలిచింది.

గత ఆర్థిక సంవత్సరంలో మెప్మా విభాగంలో 350 మహిళా గ్రూపులకు రూ.5 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 358కి రూ.9.26 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలను అందజేశారు. ప్రస్తుత ఏడాది మూడు నెలల్లోనే రూ.2.60 కోట్లను అందజేశారు. మరో రూ.కోటి అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. ఏటా 25 గ్రూపులను ఏర్పాటు చేయాల్సివుండగా 35 ఏర్పాటు చేస్తున్నారు.

నిత్యం 62 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను 10 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.


NTR canteen at Velagapudi by month-end

The State government is planning to launch NTR canteens on pilot basis at Velagapudi where the interim Secretariat complex is coming up, by month-end. The government has also chalked out plans to open the NTR canteens at two more places next month.

A cabinet sub-committee comprising Municipal Administration Minister P. Narayana, Civil Supplies Minister Paritala Sunitha and Agriculture Minister Prathipati Pulla Rao as members was constituted to examine the programme in the neighbouring state, Tamil Nadu.

The sub committee visited the Amma Canteen in Tamil Nadu. Similar canteens are being run in neighbouring Telangana State also. The issue of NTR canteens figured at Mahanadu, a TDP conclave, was organised in Tirupati recently.

ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ కౌన్సిలర్ వెంకట నాంచారయ్యకు స్థానికంగా పెట్రోల్ బంకు ఉంది. బంక్ స్థలం డాక్యుమెంట్లను తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయాలంటూ ఆయన గత పదిరోజులుగా రెవెన్యూఇన్‌స్పెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆర్‌ఐ శ్రీనివాసరావు మాత్రం రూ.10 వేలు ఇవ్వందే పని కాదని తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారి సూచనల మేరకు బుధవారం సాయంత్రం ఆర్‌ఐ కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పుల్లారావు గారు

రానున్న మూడేళ్లల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ప్రణాళికతో కృషి చేయనున్నట్లు మంత్రి పుల్లారావు గారు చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి పురోగతిపై నివేదిక తెలుసుకుంటున్నానన్నారు. 2018 నాటికి నూరుశాతం సీసీరోడ్లు, పట్టణంలో రూ.250కోట్లతో తాగునీటి వ్యవస్థ, 54 పంచాయతీ గ్రామాలకు తాగునీటి సౌకర్యం, ఇంకుడు గుంతలు, సేద్యపు నీటిగుంటలు, మరుగుదొడ్లు నూరుశాతం లక్ష్యం సాధించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

22న రైతులకు రుణమాఫీ ధ్రువపత్రాల అందజేత

ఈనెల 22న ఒంగోలులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండోవిడత రుణమాఫీ రూ.3,200కోట్ల నిధులకు సంబంధించి ధ్రువప��్రాలు రైతులకు అందిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అదేరోజు నుంచి వాటిని బ్యాంకులో ఇచ్చిన రైతులకు రుణమాఫీ నగదు జమ అవుతుందన్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో ఏర్పాటు చేస్తున్న సీసీరోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని బుధవారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొండవీడును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఘాట్‌రోడ్‌ల నిర్మాణం పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు సందర్శిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల పునర్నిర్మాణం, మరమ్మతులకు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌ తీరును విమర్శించారు.

ACB Numbers

చిలకలూరిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగితే ప్రజలు 9491305638(డీఎస్పీ), 9440446165(సీఐ) నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.

Stray dog reigns in Chilakaluripet

As many as 25 persons, including 15 children, were injured when a stray dog attacked them while they were walking on the road at Subhaninagar, Rajannapalem and Subbaiahthota areas in Chilakaluripet town on Monday morning. One of the children was seriously injured.  

The canine bites 25, including 15 kids, before being killed by locals

According to sources, the children were playing on the road and some others were walking on the road when the dog attacked them. The dog first attacked the children at Subhaninagar. When the locals pelted stones at the dog, it entered Rajupalem and Subbaiahthota areas and bit some more persons. The locals killed the dog as a precautionary measure. 

The injured have been shifted to Government Hospital in Chilakaluripet. As many as 13 persons, including nine children, have been shifted to the GGH for better treatment. Regional Medical Officer Dr T Ramesh who is supervising medical services to the patients in GGH said, “We have admitted 9 children who were injured in the dog attack. One boy is seriously injured. 

The dog bit him on the upper lip. We have discharged four persons and giving treatment to children. They are out of danger.” Chilakaluripet Municipal Commissioner N Kanakaiah said, “As per the Supreme Court orders, we have sterilised 380 dogs in Chilakaluripet town so far for birth control. A veterinary assistant surgeon has been asked to conduct the inquiry into the incident.”

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే ఆలోచనతోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుట్టిన రోజున కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన సతీమణి వెంకటకుమారి తెలిపారు. స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మంత్రి జన్మదినం పురస్కరించుకుని స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరం ద్వారా ఇప్పటివరకు 40వేల మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పారు. పేదలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్���ారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ అధ్యక్షులు, ధనలక్ష్మి గ్రూపు సంస్థ డైరెక్టర్‌ పేర్ని వీరనారాయణ ప్రసంగిస్తూ సంస్థ ద్వారా త్వరలో మోకాళ్ల వ్యాధులకు సంబంధించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు.

ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మహంతి మాట్లాడుతూ ప్రత్తిపాటి జన్మదినం పురస్కరించుకుని ఏటా వేల మందికి కంటిచూపును ప్రసాదించడం గొప్ప విషయమన్నారు.

ముందుగా ఏఎంజీ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మహంతి దంపతులకు ఉత్తమ పౌరసేవా పురస్కారం అందించి సత్కరించారు. ప్రత్తిపాటి గార్డెన్స్‌లో జరిగిన వైద్య శిబిరానికి వచ్చిన రోగులలో 4వేల మంది కంటి శస్త్రచికిత్సకు ఎంపికైనట్లు వైద్యులు చెప్పారు.

లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం

మగబిడ్డ పుడితే రూ.వెయ్యి ఇవ్వాలి.. ఆడపిల్ల పుడితే రూ.500 ఇవ్వాలి. లేదంటే  మీ బిడ్డను ఇవ్వం’ అంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న ఆయాలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని పలువురు బాలింతల కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుతో ఆర్‌ఎంవో డాక్టర్ రమేశ్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు కాన్పుల విభాగంలో విచారించారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో)లు పి.పద్మ, ఆర్.కమల, సత్యవేదంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు. సంఘటనలు పునరావృత్తం కాకుండా కాన్పుల విభాగంలో లోపల, వరండా వైపు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగితే ప్రజలు 9491305638(డీఎస్పీ), 9440446165(సీఐ) నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.

ఎసిబి వలలో ఫైర్‌ ఆఫీసర్‌

అగ్నిప్రమాదంలో ఫ్యాన్సీషాపు కాలిపోయిన ఘటనలో బాధితుడి నుండి 20వేలు లంచం తీసుకుంటూ ఫైర్‌ అధికారి శివశంకర్‌ ఎసిబికి పట్టుబడ్డాడు. ఈ సంఘటన పిడుగురాళ్లలో గురువారం జరిగింది. జిల్లా ఎసిబి డిఎస్పి చంద్రవంశం దేవానంద్‌శాంత్‌ తెలిపిన వివారాల ప్రకారం పిడుగురాళ్లలో జమ్మిగుంపుల నరేంద్ర నాగబాలాజి ఫ్యాన్సీ స్టోర్‌ నడుపుకుంటున్నారు. ఫిబ్రవరి14వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో షాపు తగులబడింది. 

ఈ నేపధ్యంలో షాపు కాలిపోయినట్లు సర్టిఫికెట్టు ఇస్తే తాను ఇన్సూరెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటానని పిడుగురాళ్ల పట్టణ అగ్నిమాపక అధికారి శివశంకర్‌ను కోరాడు. అయితే సర్టిఫికెట్టు ఇవ్వడానికి శివశంకర్‌ రూ.30వేలు డిమాండ్‌ చేశాడు. నెలరోజులపాటు తిరగ్గా రూ.20వేలు ఇస్తే సర్టిఫికెట్టు ఇస్తానని తెలపడంతో బాధితుడు బాలాజి ఎసిబిని ఆశ్రయించాడు. వలపన్నిన ఎసిబి అధికారులు కెమికల్‌ పూసిన రూ.20వేల నగదును బాలాజీకి ఇచ్చారు. ఆనగదు ఫైర్‌ ఆఫీసర్‌కి ఇచ్చే సమయంలో పట్టుకున్నారు. అనంతరం శివశంకర్‌ చేతులు నీటిలో శుభ్రం చేయగా కెమికల్‌ రంగు మారడంతో లంచం తీసుకున్నట్లు ధృవపరచి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శివశంకర్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. ఇంక ఎవరైనా ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బంది పడుతుంటే 9491305638 నెంబర్‌కు సమాచారం అందించాలని, వారి విషయాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందని ఎసిబి డిఎస్పి దేవానంద్‌ తెలిపారు.

లంచగొండికి ఏసీబీ బేడీలు

రాజుపాలెం: జనాన్ని జలగలా పట్టిపీడిస్తున్న ఓ లంచగొండి ఉద్యోగికి ఏసీబీ బేడీలు పడ్డాయి. కేవలం ఎకరం 18 సెంట్ల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయటానికి ముప్పతిప్పలు పెట్టిన వీఆర్‌వోను ఓ యువకుడు ఏసీబీకి పట్టించిన వైనం ఇది. ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్‌ శాంత్రో కథనం ప్రకారం... రాజుపాలెం మండలం ఉప్పలపాడు వీఆర్‌వోగా దాసరి దానియేలు ఏడాది కిందటే ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. మొదట్లో కాస్త మౌనంగానే కనిపించిన అతడు... రానురాను లంచం కోసం జనాన్ని పీడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాజుపాలెం పరిధిలో తనకున్న ఎకరం 18 సెంట్ల భూమిని ఆన్‌లైన్‌ నమోదు చేయాలని క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆవుల పెదవెంకటేశ్వర్లు గతనెల 8న వచ్చాడు. ఓ వారం రోజులు వీఆర్‌వో చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనారోగ్యానికి గురైన పెద వెంకటేశ్వర్లు తన కుమారుడు గోవిందరాజులును వీఆర్‌వో వద్దకు పంపాడు. వారం రోజుల కిందటే రూ.7 వేలు ఇవ్వాలని మీనాన్నకు చెప్పాను.. కనీసం రూ.5 వేలు ఇస్తేనే పనిచేసి పెడతానని వీఆర్‌వో దానియేలు తెగేసి చెప్పాడు. పేదవాళ్లం మీరడిగినంత డబ్బు లేదని చెప్పినా వీఆర్వో పనిచేయలేదు. దీంతో గోవిందరాజులు ఈనెల 27న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం రూపొందించిన అధికారులు బుధవారం సాయం��్రం అమలు చేశారు. గోవిందరాజులతో రూ.5 వేలు నగదును ఇప్పించారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ పీ దేవానంద్‌ శాంత్రో ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వీఆర్‌వో దానియేలును పట్టుకున్నారు. ఈ దాడుల్లో సీఐ నరసింహారెడ్డి పాల్గొన్నారు. 
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి 
ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం డిమాండ్‌ చేస్తే తమను ఆశ్రయించాలని గుంటూరు ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్‌శాంత్రో సూచించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలను నగదు డిమాండ్‌ చేయడం నేరమన్నారు. ఎవరైనా లంచం అడిగితే సెల్‌.9491305638కు సమాచారం ఇవ్వాలన్నారు.

పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైపనింగ్‌ ఛాంబర్లు

పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో రైపనింగ్‌ ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో నూతనంగా రూ.24 లక్షలతో ఏర్పాటు చేసిన రైపనింగ్‌ ఛాంబర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అక్కడే రూ.21.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కార్బైడుకు ప్రత్యామ్నాయంగా ఇథిలీన్‌ ద్వారా పండ్లను మాగబెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 16 రైపనింగ్‌ ఛాంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైన చోట ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మామూలుగా 20 రోజుల్లో పండే ఫలాలు దీని ద్వారా 4 రోజుల్లో పండుతాయన్నారు. తద్వారా రైతులకు సమయం కలిసిరావటంతో పాటు లాభాలుకూడా పొందవచ్చన్నారు. వీటితోపాటు అవసరమైన చోట శీతల గిడ్డంగులు, గోదాములను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

చిలకలురిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

చిలకలురిపేట (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) నూతన కార్యవర్గాన్ని  స్దానిక శ్రీనివాసా ఇంటర్నేషనల్ రాజదర్బార్ సమావేశమందిరంలో గురువారం  జరిగిన సమావేశoలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అద్యక్షుడుగా  నార్నె బాబుజీరావు, అద్యక్షుడిగా  షేక్  మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శిగా గాయాల వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా  షేక్  ఫైరొజ్, ఉపాద్యక్షులుగా షేక్  అల్లాబక్షు  , బి  శ్రీను నాయక్, అందె శివబాబు, సంయుక్త  కార్యదర్శులుగా పి లీలా నంద్, జాగు  బ్రహ్మం, షేక్ హసన్  వలి, కోశాదికారిగా ఉప్పాల సుభానిలు ఎంపికయ్యారు.